తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆమ్లా, డివిలియర్స్ స్థానాలను అంత త్వరగా పూడ్చలేం'

అనుభవలేమే భారత్​పై ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. సీనియర్ క్రికెటర్ల స్థానాలను రాత్రికిరాత్రే భర్తీ చేయలేమని చెప్పాడు.

డుప్లెసిస్

By

Published : Oct 14, 2019, 5:46 AM IST

పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్​పై పరాజయం గురించి స్పందించాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్​. ఈ ఓటమి కేవలం అనుభవలేమి వల్లే వచ్చిందని చెప్పాడు. హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్ లాంటి క్రికెటర్ల స్థానాలనురాత్రికిరాత్రే భర్తీ చేయలేమని తెలిపాడు.

"ఈ ఓటమి కారణం కేవలం అనుభవలేమి అని నేను అనుకుంటున్నా. ప్రస్తుతమున్న ఉత్తమ టెస్టు జట్లలో ఎక్కువ మంది అనుభవం గల ఆటగాళ్లు ఉన్నారని ఈ సిరీస్​కు ముందే చెప్పా. భారత్ విషయానికి వస్తే.. అనుభవజ్ఞులు ఆ జట్టు సొంతం. వాళ్లల్లో చాలామందికి ఇంతకు ముందు అంతర్జాతీయ టెస్టులు ఆడిన అనుభవం ఉంది." -ఫాఫ్ డుప్లెసిస్, దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్.

ఆమ్లా, డివిలియర్స్ లాంటి క్రికెటర్ల స్థానాలను రాత్రికిరాత్రి భర్తీ చేయలేమని చెప్పాడు డుప్లెసిస్.

"మా జట్టులో ఉన్న అనుభవం గల క్రికెటర్లను కోల్పోయాం. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, హషీమ్ ఆమ్లా, డివిలియర్స్ ఈ తరంలో మేటీ ఆటగాళ్లు. అలాంటి క్రికెటర్ల స్థానాలను రాత్రికిరాత్రే పూడ్చలేం. ప్రస్తుతం జట్టులో నేను, డేనో, డికాక్ మినహా మిగతా వారు పరుగులు చేస్తారని మేము ఆశించలేదు." -ఫాఫ్ డుప్లెసిస్​, దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్.

ఈ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్​ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత్​. కెప్టెన్​గా 50వ టెస్టు ఆడిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్​లో ద్విశతకంతో అదరగొట్టాడు. 254 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మయాంక్ అగర్వాల్ శతకం, రవీంద్ర జడేజా 91 పరుగులతో ఆకట్టుకున్నారు.

ఇదీ చదవండి: వైరల్​ వీడియో : అమితాబ్​ తన బిడ్డ అన్న జయబచ్చన్​​

ABOUT THE AUTHOR

...view details