బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది టీమిండియా. ఇప్పటికే వరుస సిరీస్‌ల్లో విఫలమైన రిషభ్ పంత్ మరోసారి నిరాశపర్చాడు. బ్యాటింగ్‌లోనే కాక కీపర్‌గానూ సమీక్షను అంచనా వేయడంలో తప్పిదం చేశాడు. ఈ కారణంగా ధోనీతో పోలుస్తూ మరోసారి నెటిజన్లకు చిక్కాడు పంత్.
ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లో 27 పరుగులు చేశాడు పంత్. బంగ్లా ఛేదనలో చాహల్ వేసిన బంతిని అంచనా వేయడంలో తప్పిదం చేసి సమీక్షలో విఫలమయ్యేలా చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ పంత్‌లో వికెట్ కీపింగ్ స్కిల్స్ లోపిస్తున్నాయని ట్రోల్స్ చేస్తున్నారు.