తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్.. అభిమానులను ఇలాగే అలరించు: అఫ్రిదీ - match

మొహాలీ వేదికగా సఫారీలతో జరిగిన రెండో టీ-20లో ఆకట్టుకున్న విరాట్​ను అభినందించాడు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ. క్రికెట్ అభిమానులను బ్యాటింగ్​తో ఇలాగే అలరించు అంటూ ట్వీట్ చేశాడు.

అఫ్రిదీ

By

Published : Sep 19, 2019, 12:43 PM IST

Updated : Oct 1, 2019, 4:37 AM IST

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో అర్ధశతకంతో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సర్వత్రా ప్రశంసిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ.. కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించు అంటూ ట్వీట్ చేశాడు.

"విరాట్ నిజానికి నువ్వు గొప్ప ఆటగాడివి. నీ విజయాలను ఇలాగే కొనసాగించు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను నీ బ్యాటింగ్​తో అలరించు" -షాహిద్ అఫ్రిదీ ట్వీట్

మొహాలీ వేదికగా జరిగిన రెండో టీట్వంటీ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది భారత్. విరాట్ 52 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 150 పరుగుల లక్ష్యాన్ని ఓ ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది టీమిండియా. ఈ ఇన్నింగ్స్​తో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2,441) చేసిన బ్యాట్స్​మన్​గానూ రికార్డుకెక్కాడు విరాట్.

టీ20ల్లో 11వ సారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ.. అఫ్రిదీని(11) సమం చేసి రెండో స్థానంలో నిలిచాడు. అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ(12) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇదీ చదవండి: యువీ.. 6 బంతుల్లో 6 సిక్సర్లకు పన్నెండేళ్లు

Last Updated : Oct 1, 2019, 4:37 AM IST

ABOUT THE AUTHOR

...view details