2011 ప్రపంచకప్ తర్వాత కెరీర్లో యువరాజ్ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియే కారణమని ఆరోపించారు యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్. తన కుమారుడు జట్టులో ఉండేందుకు ధోని ఇష్టపడేవాడు కాదని అన్నారు.
'కెప్టెన్గా యువరాజ్ బదులు ధోని'
కెప్టెన్గా యువరాజ్కే ముందు అవకాశమొచ్చిందని, కానీ చివరి నిమిషంలో ధోనికి దక్కిందని చెప్పారు యోగ్రాజ్. ఆ తర్వాత యువీతో మాత్రమే కాకుండా చాలా మంది ఆటగాళ్లతో ధోని దురుసుగా ప్రవర్తించేవాడని అన్నారు. అతడికి జట్టు కంటే కెప్టెన్సీ అంటేనే ఎక్కువ ఇష్టమని, అందుకే అలా ఉండేవాడని చెప్పారు. ధోని స్నేహితుడు కావడం వల్ల యువరాజ్ దీని గురించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదని అన్నారు.
'ఆరోగ్యం సహకరించకపోయినా యువీ ఆడాడు'