పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాపై ప్రశంసల వర్షం వెల్లువెత్తుతున్నాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్న సాహా.. ఆ ప్రదర్శనకు గల కారణాన్ని వెల్లడించాడు. నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమించానని చెప్పాడు.
"ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీతో కలిసి సాధన చేశా. విభిన్న రకాలుగా వాళ్లు నావైపు బంతిని సంధించి నా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సాయపడ్డారు. వేగంగా వస్తున్న బంతిని ఎలా అందుకోవాలో అనేదానిపై బాగా ప్రాక్టీస్ చేశా. ఇందుకు నాకు సహకరించిన ట్రెయినర్లుకు కృతజ్ఞతలు. స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు, ఐస్ బాత్‌లు చేయించి నా ఫిట్నెస్ మెరుగయ్యేందుకు ఎంతో కృషిచేశారు" -వృద్ధిమాన్ సాహా, టీమిండియా వికెట్ కీపర్