టెస్టుల్లో వికెట్‌కీపింగ్ స్థానం కోసం యువ ఆటగాడు రిషబ్ పంత్, సీనియర్ వృద్ధిమాన్ సాహాల మధ్య చాలాకాలం నుంచి గట్టి పోటీ నడుస్తోంది. పంత్ మెరుగైన బ్యాట్స్‌మన్ అయితే.. సాహా ఏమో మెరుగైన వికెట్‌కీపర్. అయితే జట్టు మేనేజ్‌మెంట్.. ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టుల్లో పంత్‌నే ఎంచుకుంది. పంత్ కూడా వీరోచిత బ్యాటింగ్‌తో వికెట్ కీపర్ రేసులో ముందుకు దూసుకెళ్లాడు. కానీ పంత్ బ్యాటింగ్ పట్ల తానేమీ ఆందోళన చెందట్లేదని సాహా వ్యాఖ్యానించాడు.
"నేను 2018 నుంచే ఈ పోలికల గురించి వింటున్నా. నా పని నేను చేస్తా. పంత్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడన్న దాని గురించి ఆందోళన చెందను. ఆ కారణం వల్ల నేను నా ఆటను మార్చుకోను. ఎవరు వికెట్ కీపింగ్ చేయాలో నిర్ణయించాల్సింది మేనేజ్‌మెంటే. ఒక్క క్యాచ్ చేజారినా మ్యాచ్ ఫలితం మారేందుకు ఆస్కారముంది. వికెట్‌కీపింగ్ అనేది స్పెషలిస్ట్ స్థానం. నేను వచ్చిన ప్రతి క్యాచ్‌నూ పడతానని చెప్పట్లేదు. కానీ స్పెషలిస్ట్ స్థానం స్పెషలిస్ట్ స్థానం లాగే ఉండాలి" అని సాహా చెప్పాడు.
మొదట వికెట్‌కీపర్‌నే..