ప్రస్తుతం ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతున్న వారిలో భారత స్టార్ పేసర్ బుమ్రా ముందుంటాడు. అయితే అతడు తన ముందు ఓ 'బేబీ బౌలర్' అని అన్నాడు పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్. మేటి పేసర్లు మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్‌తో పోల్చుకుంటే జస్ప్రీత్ను సులభంగా ఎదుర్కొంటానని చెప్పాడు.
"మేటి బౌలర్లయిన గ్లెన్ మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్ లాంటి వారిని ఎదుర్కొన్నా. వారితో పోలిస్తే బుమ్రా ఓ బేబీ బౌలర్. ఇప్పుడైనా అతడి బౌలింగ్‌ను సులభంగా ఆడేస్తాను. విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ వల్ల కచ్చితమైన పేస్ రాబడుతూ బంతులు వేస్తున్నాడు బుమ్రా" -అబ్దుల్ రజాక్, పాక్ మాజీ ఆల్‌రౌండర్