టీ20 క్రికెట్ ఆడటమంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ప్రస్తుతం తాను ఉన్నట్లయితే టీ20లకు అనుగుణంగా భారీ షాట్లను కొట్టేందుకు తన ఆట తీరును మార్చుకునేవాడినని అన్నాడు. టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో ట్విట్టర్ లైవ్‌లో మాట్లాడిన గంగూలీ.. వీటితో పాటే అనేక విషయాలు పంచుకున్నాడు.
"టీ20 ఎంతో ముఖ్యమైన ఫార్మాట్. ఐపీఎల్లో మొదటి ఐదేళ్లు ఆడాను కానీ ఇప్పుడు ఉండుంటే, కచ్చితంగా నా ఆటతీరు మార్చుకునేవాడని. మైదానంలో బౌలింగ్ చేసేందు, బ్యాటింగ్ ప్రదర్శన మెరుగుపరిచేందుకు టీ20 ఓ లైసెన్స్లాంటింది. ఈ ఫార్మాట్ అంటే నాకు చాలా ఇష్టం"