టీ20ల్లో టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అత్యుత్తమ ఓపెనర్లని ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ అన్నాడు. ట్విట్టర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు టామ్ సమాధానాలు ఇచ్చాడు.
'రోహిత్, వార్నర్ అత్యుత్తమ ఓపెనర్లు' - Warner & Rohit best openers says : Moody
టీ20ల్లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ అత్యుత్తమ ఓపెనర్లని అన్నాడు ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ. నెట్టింట అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ విధంగా స్పందించాడు.
"టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ఓపెనర్లుగా ఎవరిని ఎంపిక చేస్తారు?" అని ఓ నెటిజన్ అడిగాడు. "ఇది కాస్త కఠినమైన ప్రశ్న. డేవిడ్ వార్నర్, రోహిత్‌శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగితే ఎక్కువగా సంతోషిస్తా" అని టామ్ బదులిచ్చాడు. అంతేకాక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ధోనీ కెప్టెన్సీ తనకి ఎంతో ఇష్టమని తెలిపాడు.
భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఫేవరేట్ అని, ఫీల్డింగ్‌లో రవీంద్ర జడేజా ఇష్టమని తెలిపాడు. భారత యువక్రికెటర్లలో ఎంతో నైపుణ్యం ఉందని, శుభ్‌మన్ గిల్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నాడు. మైదానంలో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మెదడు ఎంతో చురుకుగా పనిచేస్తుందని కొనియాడాడు. విలియమ్స్‌ను ప్రాతినిధ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గతంలో టామ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
TAGGED:
రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్