మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న మొతేరా స్టేడియం లైటింగ్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశాడు భారత కెప్టెన్ కోహ్లీ. ఎల్ఈడీ లైట్ల వల్ల ఫీల్డింగ్ జట్టుకు ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపాడు.
అహ్మదాబాద్‌లో పునఃనిర్మించిన మొతేరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా రికార్డు సృష్టించింది. కానీ, ఇతర స్టేడియాల తరహాలో ఫ్లడ్‌లైట్లు కాకుండా మైదానం పైకప్పు చుట్టూ ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఇది చూడటానికి వలయాకారంలో ఉన్న మంటలాగే కనిపిస్తుంది. దీని వల్ల ఫీల్డింగ్ చేసే జట్టుకు సమస్యలు ఎదురవుతాయని విరాట్ ఆందోళన వ్యక్తం చేశాడు.
"ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతేరాను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. లైటింగ్ వ్యవస్థను చూసి ఒకింత ఆందోళనకు గురయ్యాను. ఈ తరహా లైట్ల వల్ల బంతిని గుర్తించడం కష్టమవుతుంది. కానీ, ఆటగాళ్లు ఈ సమస్యను తొందరగా అధిగమించాలి. గతేడాది ఐపీఎల్లో ఇలాంటి పరిస్థితి మాకు దుబాయ్‌లోనూ ఎదురైంది."