తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రికార్డును టీమిండియా నిలబెట్టుకుంటుందా..! - టెస్టు ఛాంపియన్​షిప్

వెస్టిండీస్​ పర్యటనలో ఉన్న కోహ్లీసేన.. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్​లను కైవసం చేసుకుంది. అంటిగ్వా వేదికగా గురువారం ప్రారంభం కానున్న టెస్టు సిరీస్​పైనా భారత్​ కన్నేసింది. సుదీర్ఘ ఫార్మాట్​లో గత 17ఏళ్లుగా విండీస్​పై ఓడిపోని టీమిండియా ఈ సిరీస్​ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఆ రికార్డును టీమిండియా నిలబెట్టుకుంటుందా..!

By

Published : Aug 22, 2019, 5:30 AM IST

Updated : Sep 27, 2019, 8:25 PM IST

వెస్టిండీస్​-భారత్​ తొలి టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. టెస్టు ఛాంపియన్​షిప్​ను ఈ సిరీస్​తో ప్రారంభిస్తున్నాయి ఇరుజట్లు.​ విండీస్​పై 2002 నుంచి ఒక్క టెస్టు సిరీస్​ ఓడిపోని భారత్​.. ఈ రెండు మ్యాచ్​లు గెలిచి 17 ఏళ్లు నుంచి ఉన్న రికార్డును కొనసాగించాలని చూస్తోంది.

ధోనీ రికార్డుకు చేరువలో...

ఈ సిరీస్​లో టీమిండియా గెలిస్తే కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అరుదైన ఘనత సాధిస్తాడు. 2016లో వెస్టిండీస్​తో జరిగిన నాలుగు టెస్టుల్లో విజయం సాధించింది కోహ్లీసేన. ఇప్పుడు ఇది​ గెలిస్తే కరీబియన్లపై వరుసగా రెండు సిరీస్​లు గెలిపించిన సారథి​గా రికార్డు సొంతం చేసుకుంటాడు విరాట్.

కొత్త జెర్సీలో టీమిండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ

ఇప్పటి వరకూ టెస్టుల్లో 60 మ్యాచ్​లకు సారథ్యం వహించిన మహీ... 27 విజయాలు సాధించాడు. అయితే కెప్టెన్​గా 46 మ్యాచుల్లో 26 గెలిచి ధోనీకి చేరువలో ఉన్నాడు కోహ్లీ. అదే విధంగా కొత్త టెస్టు జెర్సీల్లో దర్శనమివ్వనున్నారు టీమిండియా ఆటగాళ్లు.

నూతన జెర్సీల్లో టీమిండియా ఆటగాళ్లు

1948 నుంచి మెదలైన విండీస్​-ఇండియా టెస్టు సిరీస్​ల్లో వెస్టిండీస్​ ఎక్కువసార్లు గెలిచింది. 23 సిరీస్​లు జరగ్గా విండీస్​ 12, భారత్​ 9 సిరీస్​లు​ కైవసం చేసుకున్నాయి.

టెస్టు సిరీస్​లోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని చూస్తోంది వెస్టిండీస్​. హోప్, క్యాంప్​బెల్, హెట్మయిర్ తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. అనుభవజ్ఞుడు డారెన్​ బ్రావో, కెప్టెన్ హోల్డర్ భారత్​ను నిలువరించేందుకు​ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్​లో విండీస్​ తరఫున కార్న్​వాల్ అరంగేట్రం చేసే అవకాశముంది.

జట్లు(అంచనా)

భారత్:విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, రిషభ్‌ పంత్‌, చెతేశ్వర్‌ పుజారా, రాహుల్‌, ఇషాంత్‌ శర్మ

వెస్టిండీస్​: జేసన్​ హోల్డర్(కెప్టెన్), బ్రాత్​వైట్​, డారెన్ బ్రావో, హోప్, క్యాంప్​బెల్, ఛేజ్, కార్న్​వాల్, డౌరిచ్, గాబ్రియోల్, హెట్మయిర్, రోచ్

ఇది చదవండి: కొత్త టెస్టు జెర్సీల్లో టీమిండియా క్రికెటర్లు

Last Updated : Sep 27, 2019, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details