తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ రాకముందు ఒక లెక్క.. అడుగుపెట్టాక ఒక లెక్క - టీమిండియా

టీమిండియా క్రికెట్​లో ఒక పరుగుల మెషీన్​.. కింగ్ కోహ్లీ. ఈ పరుగుల వీరుడు జట్టులోకి రాకముందు, వచ్చిన తర్వాత అన్నట్టుగా టీమ్​ దశే పూర్తిగా మారింది. విరాట్​ నాయకత్వంలో భారత జట్టు విజయకేతనం ఎగురవేయటమే కాకుండా వ్యక్తిగతంగా టాప్​ బ్యాట్స్​మన్​గా పేరు తెచ్చుకున్నాడు పరుగుల రారాజు కోహ్లీ. వన్డేల్లో మొదటి ర్యాంకులో మూడు ఏళ్లుగా కొనసాగుతున్నాడు టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ. అతని కన్నా ముందు ఆ స్థానంలో ఎవరున్నారో తెలుసుకుందామా..!

World-Number-One-Batsmen-In-This-Decade
కోహ్లీ రాకముందు ఒక లెక్క.. అడుగుపెట్టాక ఒక లెక్క

By

Published : Dec 31, 2019, 9:49 PM IST

వన్డేల్లో అందరూ రాణించగలరు. కొందరు మాత్రమే బంతిని శాసించగలరు. పరుగుల వరద పారించగలరు. ఏడాదిని అగ్రస్థానంతో ముగించగలరు. ఒక్కో ఆటగాడు.. తన కెరీర్‌లో ఒక్కో దశలో ఉన్నత స్థితిలో ఉంటాడు. అలా 2010 నుంచి 2019 వరకు పదేళ్ల కాలంలో కేవలం ముగ్గురే అగ్రస్థానంలో నిలిచారు. అదీ వరుసగా 2017-2019 వరకు కింగ్‌ కోహ్లీ వన్డేల్లో నంబర్‌వన్‌గా.. 2013-2016 వరకు ‘మిస్టర్‌ 360’ ఏబీ డివిలియర్స్‌, 2010-2012 వరకు దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా ఉన్నారు. వారు ఏయే సంవత్సరాల్లో ఎన్ని పరుగులు చేశారు? ఎన్ని రేటింగ్‌ పాయింట్లు సాధించారో తెలుసుకుందాం.

2019లో విరాట్ ​కోహ్లీదే వన్డే ర్యాంకింగ్స్​లో మొదటిస్థానం

2019లో విరాట్​ కోహ్లీ చేసిన పరుగులు, రేటింగ్​

2018లో విరాట్ ​కోహ్లీదే వన్డే ర్యాంకింగ్స్​లో మొదటిస్థానం

2018లో విరాట్​ కోహ్లీ చేసిన పరుగులు, రేటింగ్​

2017లో విరాట్ ​కోహ్లీదే వన్డే ర్యాంకింగ్స్​లో మొదటిస్థానం

2017లో విరాట్​ కోహ్లీ చేసిన పరుగులు, రేటింగ్​
సంవత్సరం ఆటగాడు వ్యక్తిగత పరుగులు రేటింగ్​ దేశం
2016 ఏబీ డివిలియర్స్ 339 861 దక్షిణాఫ్రికా
2015 ఏబీ డివిలియర్స్ 1193 900 దక్షిణాఫ్రికా
2014 ఏబీ డివిలియర్స్ 879 887 దక్షిణాఫ్రికా
2013 ఏబీ డివిలియర్స్ 1163 872 దక్షిణాఫ్రికా
2012 హషీమ్‌ ఆమ్లా 678 901 దక్షిణాఫ్రికా
2011 హషీమ్‌ ఆమ్లా 632 840 దక్షిణాఫ్రికా
2010 హషీమ్‌ ఆమ్లా 1058 849 దక్షిణాఫ్రికా

ఇదీ చదవండి:-ఐపీఎల్ ప్రదర్శనతోనే ధోనీ జట్టులోకి: కుంబ్లే

ABOUT THE AUTHOR

...view details