తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ దేశాల్లో రాణిస్తేనే టీమ్​ఇండియా నెంబర్ వన్' - న్యూజిలాండ్ భారత్

న్యూజిలాండ్ పర్యటనలో టీమ్​ఇండియా టెస్టు సిరీస్​ను క్లీన్ స్వీప్ చేసుకుంది. అయితే ఈ విషయం తనను చాలా బాధించిందని అన్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్.

జాఫర్
జాఫర్

By

Published : Mar 28, 2020, 4:39 PM IST

న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా మొదట జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన టీమ్‌ఇండియా తర్వాత వన్డే, టెస్టు సిరీసుల్లో ఘోర పరాభవం చవిచూసింది. ఈ విషయం తనను బాధించిందని మాజీ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ అన్నాడు. ప్రపంచ నెంబర్‌ వన్‌ జట్టుకు ఇలాంటి ఫలితాలు రావడం సరికాదన్నాడు. ఈ ఫలితాల వల్ల వ్యక్తిగతంగా నిరాశచెందానని చెప్పాడు.

"టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేశాక వన్డే, టెస్టు సిరీస్‌లు ఏకపక్షంగా కోల్పోయింది. ప్రపంచ నెంబర్‌ వన్ జట్టు ఇలా ఓడిపోకూడదు. భారత్ విదేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్లలా ఆధిపత్యం చెలాయించాలి. ఆ రెండు జట్లూ ఇతర దేశాల్లో విజయాలు సాధించే మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. భారత జట్టుకు ఆ సత్తా ఉన్నా ఆడాల్సిన తీరులో ఆడలేకపోతోంది. గతేడాది ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించినా.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో ఇంకా రాణించలేదు. అక్కడా రాణిస్తేనే ఎవర్నైనా బలమైన జట్టుగా గుర్తిస్తారు. టీమ్‌ఇండియాను స్వదేశంలో ఓడించడం ప్రపంచంలో ఏ జట్టుకైనా కష్టమే. కానీ, అదే భారత జట్టు SENA దేశాల్లో రాణిస్తేనే అసలైన ప్రపంచ నెంబర్‌ వన్ జట్టు అనే గుర్తింపు లభిస్తుంది."

-వసీం జాఫర్‌, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జాఫర్ రంజీ ట్రోఫీ లెజెండ్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు(156) ఆడిన ఆటగాడిగా, అత్యధిక పరుగులు(12,038) చేసిన బ్యాట్స్‌మన్‌గా, అత్యధిక సెంచరీలు(40) బాదిన క్రికెటర్‌గా, అత్యధిక క్యాచ్‌లు(200) అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ABOUT THE AUTHOR

...view details