తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్ ఓటమి మినహా అంతా ఓకే: రోహిత్​ - Rohit Reaction

2019 ప్రపంచకప్​లో నిష్క్రమణ మినహా..​ అన్ని ఫార్మాట్లలో టీమిండియా అద్భుతంగా రాణించిందని రోహిత్ తెలిపాడు. ఈ ఏడాది భారత జట్టు ప్రదర్శనపై పలు విషయాలను పంచుకున్నాడు.

World Cup win would have been nice but enjoyed batting through 2019: Rohit
రోహిత్ శర్మ

By

Published : Dec 23, 2019, 9:41 PM IST

2019 ప్రపంచకప్​లో సెమీస్​లో వెనుదిరగటం తప్ప.. మిగిలిన అన్ని సిరీస్​లు సంతృప్తినిచ్చాయని టీమిండియా ఓపెనర్ రోహిత్​ శర్మ తెలిపాడు. ప్రస్తుతం తన బ్యాటింగ్​ శైలి మెరుగయ్యిందని అభిప్రాయపడ్డాడు.

"ఈ ఏడాది సంతృప్తికరంగా సాగింది. ప్రపంచకప్​లో ఓటమి తప్పితే మిగతా అన్ని ఫార్మాట్లలో జట్టుగా రాణించాం. నేను నా బ్యాటింగ్​ను ఎంజాయ్ చేస్తాను. కానీ ఇది ఇంతటితో ఆగదు. వచ్చే ఏడాది మరింత బాగుంటుందని భావిస్తున్నా."
-రోహిత్​ శర్మ, టీమిండియా క్రికెటర్.

భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని అనుకుంటానని తెలిపిన రోహిత్ ప్రతి మ్యాచ్​లో విజయం సాధించి టాప్​లో నిలవడమే లక్ష్యంగా ఆడతామని స్పష్టం చేశాడు.

"దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో సవాళ్లు ఎదురయ్యాయి. ఒకసారి విజయం సాధించాక ప్రతి మ్యాచ్​ గెలుపే లక్ష్యంగా ఆడాం. అగ్రస్థానంలో నిలవడంపైనే మా దృష్టంతా."
-రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్

ఈ ఏడాది రోహిత్​ ఆడిన అన్ని ఫార్మాట్లలో ఓపెనర్​గా 2,442 పరుగులు సాధించి జయసూర్య రికార్డును అధిగమించాడు. ఇందులో 10 శతకాలున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్​సిరీస్​లో ఓపెనర్​గా అరంగేట్రం చేసి సత్తాచాటాడు.

ఇదీ చదవండి: ఛాలెంజర్ ట్రోఫీలో హర్మన్, స్మృతి, వేద సారథ్యం

ABOUT THE AUTHOR

...view details