ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. తొలిసారి టికెట్లు కొనుక్కోలేకపోయిన వారికోసం మరో అవకాశం ఇచ్చింది ఐసీసీ. అందుకేరెండో విడత టికెట్లనుఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది. అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీనిలో అన్ని జట్లు, మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల కోసం టికెట్లు విక్రయించనున్నారు.
రెండో విడత ప్రపంచకప్ టికెట్ల అమ్మకాలు షురూ..!
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మే 30 నుంచి ఇంగ్లండ్‌లోని వేల్స్లో జరగనుంది. దీనికి సంబంధించిన రెండో విడత టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.
రెండో విడత ప్రపంచకప్ టికెట్ల అమ్మకాలు షురూ..!
‘వరల్డ్‌కప్ మ్యాచ్‌లు చూసేందుకు 8 లక్షల టికెట్ల కోసం 148 దేశాల నుంచి అభిమానులు పోటీపడ్డారు. 6 ఖండాల నుంచి 30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల కీలక మ్యాచ్‌లకు టికెట్లు చాలా తక్కువ అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని త్వరగా వినియోగించుకోవాలి'అని ఐసీసీ వెల్లడించింది.