2019 ప్రపంచకప్‌లో పరాజయం పొందటం జట్టును కలచివేసిందని టీమ్ఇండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ అన్నాడు. గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రదర్శన తర్వాత సెమీస్‌లో వెనుదిరిగిన పరిస్థితి మమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతోందని తెలిపాడు. ఇటీవలే ఓ ఆన్లైన్ చాట్ సెషన్లో పాల్గొన్న రాహుల్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
గతంలో ఏదైనా మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం వస్తే ఏంచేస్తావు? అని రాహుల్‌ను అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
"అది కచ్చితంగా ప్రపంచకప్ సెమీఫైనల్‌ను మార్చాలనుకుంటున్నాను. కొన్నిసార్లు అది జట్టును ఇప్పటికీ వెంటాడుతోంది. గ్రూప్ దశలో ఉత్తమంగా ఆడినా.. సెమీస్‌లో వెనుదిరగటం బాధాకరంగా ఉంది. నేను ఇప్పటికీ కొన్నిసార్లు ఆ పీడకల నుంచి మేల్కొంటాను".