కార్డిఫ్‌లో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టులో కెప్టెన్ దిముత్ కరుణరత్నే మినహా అందరూ విఫలమయ్యారు. మ్యాచ్ ఓడినా తన పేరిట సరికొత్త రికార్డు నెలకొల్పాడీ బ్యాట్స్‌మెన్. ఓ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు నిలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
మ్యాచ్ ఓడినా.. కెప్టెన్ ఘనత సాధించాడు
శనివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది శ్రీలంక. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచిన లంక కెప్టెన్ కరుణరత్నే సరికొత్త రికార్డు తన పేరిట నమోదు చేశాడు.
మ్యాచ్ ఓడినా.. ఘనత సాధించాడీ కెప్టెన్
ఇంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రిడ్లీ జాకబ్స్ పేరిట ఉంది. 1999 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన జాకబ్స్.. ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచి 49 పరుగులు చేశాడు. మళ్లీ ఇప్పుడు శ్రీలంక బ్యాట్స్‌మెన్ కరుణరత్నే చివరి వరకు క్రీజులో ఉండి 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇది చదవండి: లంకపై పది వికెట్ల తేడాతో కివీస్ ఘనవిజయం