రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిక్షణా శిబిరంలో ఈసారి కొత్త ఉత్తేజం కనిపిస్తుందని ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఆరోన్ ఫించ్, డేల్ స్టెయిన్, క్రిస్ మోరిస్ లాంటి వాళ్ల రాకతో సానుకూల ప్రభావం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. జట్టులోని ప్రతి లైనప్‌కు బ్యాకప్ ఉందని తెలిపాడు.
"ప్రతి సీజన్లో మా జట్టు గురించి చాలా చెప్పాం. కానీ, ఈసారి మాత్రం పూర్తి భిన్నం. ఈ విషయంలో పూర్తి హామీ ఇస్తున్నాను. అంతవరకే మీకు చెప్పగలను. మా జట్టే ఉత్తమమని చెప్పలేను కానీ వర్ణించలేని కొత్త అనుభూతి పొందుతున్నాను. జట్టులోని కొన్ని కాంబినేషన్లకు బ్యాకప్‌లు ఉన్నాయి. అందుకోసం కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్‌లు కలిసి ఉత్తమ జట్టును ఎంపిక చేస్తున్నారు. తుది జట్టులో నేను ఉండొచ్చు లేదా నా స్థానంలో పార్థివ్, డేల్ స్టెయిన్ లాంటి ఆటగాళ్లు ఆడొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మార్పులు జరుగుతున్నాయి"