ఈ నెల 21న భారత్తో జరిగే తొలి టెస్టుతో రికార్డు నెలకొల్పనున్నాడు కివీస్ బ్యాట్స్మన్ రాస్ టేలర్. మూడు ఫార్మాట్లలోనూ కివీస్ తరఫున వందేసి మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన టేలర్.. వచ్చే వన్డే ప్రపంచకప్(2023)లో తాను ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
రేసులో ఉన్నా.. వన్డే ప్రపంచకప్ ఆడతా: టేలర్
2023లో జరగబోయే వన్డే ప్రపంచకప్ రేసులో తాను ఇంకా ఉన్నానని, ఈ విషయమై వేసవి తర్వాత స్పష్టత వస్తుందని అన్నాడు కివీస్ బ్యాట్స్మన్ రాస్ టేలర్.
కివీస్ బ్యాట్స్మన్ రాస్ టేలర్
అయితే ఈ మెగాటోర్నీ కంటే ముందు జరిగే టీ20 ప్రపంచకప్లో సత్తా చాటాలనుకుంటున్నట్లు చెప్పాడు టేలర్. వచ్చే వేసవి తర్వాత తన స్థానంపై స్పష్టత వస్తుందన్నాడు.
రికార్డు స్థాయిలో వందో టెస్టు ఆడుతున్న టేలర్.. ఈ ఫార్మాట్లో తొలి మ్యాచ్ ఆడాక మళ్లీ ఇంకో టెస్టు ఆడతానని అనుకోలేదని అన్నాడు. అయితే సంప్రదాయ ఫార్మాట్లో తన ప్రయాణం బాగుందని చెప్పాడు.
Last Updated : Mar 1, 2020, 6:30 PM IST