తెలంగాణ

telangana

ETV Bharat / sports

నేను సెలక్టరైతే ధావన్​ను తీసుకోను: శ్రీకాంత్ - T20 WC Squad

తాను సెలక్టరైతే టీ20 ప్రపంచకప్ జట్టులో శిఖర్ ధావన్​ను తీసుకోనని చెప్పాడు టీమిండియా మాజీ సెలక్టర్​, ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్. రాహుల్​కే మొగ్గుచూపుతానని తెలిపాడు.

Won't pick Shikhar Dhawan for T20 World Cup: Kris Srikkanth not impressed with opener's batting form
శ్రీకాంత్

By

Published : Jan 6, 2020, 8:26 AM IST

ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ల స్థానానికి కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్​లో రెండో ఓపెనర్​గా వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఈ అంశంపై స్పందించాడు భారత మాజీ ఆటగాడు, మాజీ సెలక్టర్​ కృష్ణమాచారి శ్రీకాంత్. తాను సెలక్టరైతే కేఎల్ రాహుల్​నే తుదిజట్టులోకి తీసుకుంటానని చెప్పాడు.

"శ్రీలంకతో జరుగుతున్న సిరీస్​లో ప్రదర్శనను లెక్కలోకి తీసుకోకూడదు. నేను సెలక్టర్​నైతే ధావన్​ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోను. రాహుల్​, ధావన్​ మధ్య పోటీనే లేదు. మ్యాచ్ విన్నర్ ఒక్కరే ఉంటారు." - కృష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా మాజీ ఓపెనర్

గతేడాది ధావన్ 12 టీ20ల్లో 110.56 స్ట్రైక్​ రేట్​తో 272 పరుగులు చేయగా.. ఇదే సమయంలో రాహుల్ 9 ఇన్నింగ్స్​ల్లో 142.40 స్ట్రైక్​ రేట్​తో 356 పరుగులు చేశాడు. రెండు నెలల విరామం తర్వాత జట్టులోకి పునరాగమనం చేస్తున్న శిఖర్​.. ఇది తనకు నూతన ఆరంభమని చెప్పిన సంగతి తెలిసిందే.

గువాహటి వేదికగా ఆదివారం ప్రారంభం కావాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మంగళవారం ఇండోర్​లో శ్రీలంకతో రెండో మ్యాచ్ ఆడనుంది టీమిండియా.

ఇదీ చదవండి: ఐసీసీ నయా రూల్​: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా?

ABOUT THE AUTHOR

...view details