తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పంత్​.. టీమ్​ఇండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యపోను' - రిషభ్ పంత్

యువ క్రికెటర్​ రిషభ్ పంత్​పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్​ అజారుద్దీన్. తన ఆటతీరుతో రాబోయే కాలంలో టీమ్ఇండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.

'పంత్​.. టీమ్​ఇండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యపోను'

By

Published : Mar 31, 2021, 10:54 PM IST

రాబోయే కాలంలో రిషభ్ పంత్​ను టీమ్​ఇండియా కెప్టెన్​గా చేసినా తానేమీ ఆశ్చర్యపోనని తెలిపాడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్. ఇటీవలే దిల్లీ క్యాపిటల్స్​కు సారథిగా ఎంపికైన పంత్​.. తన అసాధారణ ఆటతీరుతో భారత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించాడు.

"గత కొన్ని నెలలుగా రిషభ్​ అద్భుతంగా ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో తనని తాను నిరూపించుకుంటున్నాడు. రాబోయే కాలంలో అతన్ని టీమ్​ఇండియా కెప్టెన్​గా ఎంపిక చేసినా నేనేమీ ఆశ్చర్యపోను. అతడి అటాకింగ్ క్రికెట్​.. భారత జట్టును అత్యుత్తమ స్థితిలో ఉంచుతుంది" అని అజార్​ ట్వీట్ చేశాడు.

ఇదీ చదవండి:'భజ్జీ చేరికతో మా స్పిన్ విభాగం బలోపేతం'

ABOUT THE AUTHOR

...view details