తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ కొవిడ్​ రూల్స్​పై ఆఫ్రిదీ అసంతృప్తి - పాకిస్థాన్​ క్రికెట్ లీగ్​

ఐసీసీ విధించిన కరోనా నిబంధనలపై పాకిస్థాన్​ క్రికెటర్​ ఆఫ్రిదీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ట్విట్టర్​ వేదికగా స్పందించాడు.

Wondering why umpires are not allowed to hold bowlers cap: Shahid Afridi questions ICC bio-bubble rules
ఐసీసీ కొవిడ్​ రూల్స్​పై ఆఫ్రిది అసంతృప్తి

By

Published : Feb 25, 2021, 5:05 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ మండలి విధించిన కరోనా నియమాలపై పాకిస్థాన్​ స్టార్​ ఆల్​రౌండర్​ షాహిద్​ ఆఫ్రిదీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ (పీఎస్​ఎల్​)లో భాగంగా ముల్తాన్​ సుల్తాన్​ జట్టు తరఫున ఆడుతున్నాడు ఆఫ్రిదీ. బౌలింగ్​ చేసేటప్పుడు క్యాప్​ను ఫీల్డ్​ అంపైర్​కు ఇవ్వగా.. దాన్ని తీసుకోవడానికి అంపైర్​ నిరాకరించాడు. దీంతో ఆశ్చర్యపోవడం ఆఫ్రిదీ వంతైంది.

ఈ విషయంపై ట్విట్టర్​ వేదికగా స్పందించాడు షాహిద్​. "డియర్​ ఐసీసీ.. ఆటగాళ్లు, అంపైర్లు ఒకే బయో బబుల్​లో ఉన్నప్పుడు.. బౌలర్ల టోపీని​ పట్టుకోవడానికి అభ్యంతరమేంటి? అలాగే ఆట చివరలో షేక్​హ్యాండ్​ ఇవ్వడానికి అనుమతించరెందుకు? ఇది ఆశ్చర్యంగా ఉంది" అంటూ ట్వీట్​ చేశాడు.

కొవిడ్ నేపథ్యంలో ఐసీసీ కొత్త నిబంధనలు పెట్టింది. బంతిపై మెరుపు కోసం ఉమ్ము రుద్దడాన్ని నిషేధించింది. ప్రత్యామ్నాయంగా చెమటను రుద్దవచ్చని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలకు ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు.

ఇదీ చదవండి:రూట్​కు 5 వికెట్లు.. 145 పరుగులకు భారత్​ ఆలౌట్​

ABOUT THE AUTHOR

...view details