వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. హర్మన్ ప్రీత్ కౌర్ సారిథిగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఫిబ్రవరి 21 నుంచి ఈ పొట్టి మెగాటోర్నీ ప్రారంభం కానుంది.
టీనేజీ సంచలనం షెఫాలీకి అవకాశం..
15 మంది జట్టులో పెద్దగా సర్ప్రైజ్లేమి లేవు. యువ సంచలనం 15 ఏళ్ల షెఫాలీ వర్మను టీమ్‌లోకి తీసుకున్నారు సెలక్టర్లు. ఇటీవలే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసిన ఈ హరియాణా అమ్మాయి.. తొలిసారి ఓ పెద్ద ఈవెంట్లో ఆడనుంది.
బంగాల్ అమ్మాయి రిచాకు చోటు..
బంగాల్ బ్యాట్స్ఉమన్ రిచా ఘోష్ 15 మంది జట్టులో చోటు దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో 26 బంతుల్లో 36 పరుగులతో ఆకట్టుకుంది రిచా. ఇందులో 4 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.
టీ20 ప్రపంచకప్ కంటే ముందు జనవరి 31 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో ట్రై సిరీస్ ఆడనుంది భారత మహిళా జట్టు. ఈ త్రైపాక్షిక సిరీస్‌కు 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. వరల్డ్‌కప్ జట్టుకు అదనంగా నుజాత్ పర్వీన్‌ను తీసుకుంది.
టీ20 ప్రపంచకప్ భారత మహిళా జట్టు..
హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జోమిమా రోడ్రిగ్స్, హర్లీన్ దేవోల్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనం యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి.
ట్రై సిరీస్ జట్టు..
హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జోమిమా రోడ్రిగ్స్, హర్లీన్ దేవోల్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనం యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, నూజాత్ పర్వీన్.
ఇదీ చదవండి: బుమ్రా, పూనం యాదవ్‌లకు పాలి ఉమ్రిగర్ అవార్డు