తెలంగాణ

telangana

ETV Bharat / sports

18 ఏళ్లయినా వరుణుడికి కోపం తగ్గలేదా?

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా అద్వితీయ విజయం సాధించింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో దక్షిణాఫ్రికాపై 5 పరుగుల తేడాతో గెలిచింది. వరుసగా ఆరోసారి ఈ టోర్నీ ఫైనల్​కు చేరుకుంది. అయితే పురుషుల సఫారీ జట్టు మాదిరిగానే మహిళల ఆశలనూ వరుణుడే అడియాసలు చేశాడు! ఇంతకీ ఏం జరిగిందంటే?

womens t20 worldcup: 18 years after same ground played by southafrica get same result by rain
దక్షిణాఫ్రికా కలపై వరుణుడు దెబ్బ కొట్టాడు

By

Published : Mar 6, 2020, 9:25 AM IST

సరిగ్గా 18 ఏళ్ల క్రితం.. 1992 పురుషుల వన్డే ప్రపంచకప్‌. అదే మైదానం.. అదే సెమీస్‌.. గెలిచేలా కనిపించిన జట్టు.. చివరకు వరుణుడి దెబ్బకు ఆఖరు బంతికి 19 పరుగులు చేయాల్సి వచ్చి ఓటమిపాలైంది. ప్రస్తుతంలోకి వస్తే మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌.. అదే మైదానం.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆ జట్టు.. విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ మరోసారి వర్షం ముంచెత్తడం వల్ల ఫైనల్‌ చేరాలన్న వారి ఆశలు గల్లంతయ్యాయి.

ప్రత్యర్థి మారినా ఫలితం మారలే

ఆ జట్టు దక్షిణాఫ్రికా.. ఆ మైదానం సిడ్నీ. అప్పటి పురుషుల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ అయితే.. ఇప్పటి మహిళల ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. అంతే తేడా. ఆ జట్టును అప్పటిలాగే ఇప్పుడూ వరుణుడు ముంచాడు. ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరాలన్న ఆ దేశ (పురుషులు, మహిళల జట్లు కలిపి) కలను తుంచాడు.

దురదృష్టమంటే దక్షిణాఫ్రికాదే! మహిళల టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచి.. సెమీస్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆ జట్టు.. ఫైనల్‌ చేరేలా కనిపించింది. కానీ వరుణుడు దెబ్బకొట్టాడు. ఒకవేళ వాన రాకపోయుంటే 134 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఛేదించేదేమో! వర్షం కారణంగా ముందు నుంచీ సెమీస్‌ మ్యాచ్‌ల నిర్వహణ అనుమానంగా మారింది. ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మ్యాచ్‌ రద్దయింది.

వరుణుడు శాంతించడం వల్ల దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పోరు మొదలైంది. ఒకవేళ వర్షం కొనసాగి ఈ మ్యాచ్‌ రద్దయితే దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరేది. గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు.. సెమీస్‌కు అర్హత సాధించేది. గ్రూప్‌ దశలో దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్‌, థాయ్‌లాండ్‌, పాకిస్థాన్‌లను ఓడించింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. సెమీస్‌లోనూ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత విజయం సాధించేందుకు దక్షిణాఫ్రికాకు మంచి అవకాశాలే కనిపించాయి. కానీ మళ్లీ చినుకులు పడడం వల్ల లక్ష్యాన్ని సవరించడం ఇబ్బందిగా మారింది. ఫైనల్‌ చేరేందుకు వచ్చిన ఓ మంచి అవకాశం, ఇలా వృథా అయిపోవడం ఆ జట్టు క్రికెటర్లుకు కన్నీటిని మిగిల్చింది.

ABOUT THE AUTHOR

...view details