మహిళా టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది భారత్. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ షఫాలీ వర్మ 15 బంతుల్లో 29 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. స్మృతి మంధాన (10), హర్మన్ ప్రీత్ కౌర్ (2) విఫలమయ్యారు.
టీ20 ప్రపంచకప్: దీప్తి శర్మ పోరాటం.. ఆస్ట్రేలియా లక్ష్యం 133 - Women's T20 World Cup 2020
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మహిళా టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్ఉమెన్ తడబడ్డారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది టీమిండియా.
టీ20
మిడిలార్డర్లో రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్ 26 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. దీప్తి శర్మ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. ఫలితంగా హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో జొనాసెన్ రెండు, ఎలిస్ పెర్రీ, కిమ్మిన్స్ చెరో వికెట్ సాధించారు.
Last Updated : Mar 2, 2020, 1:51 AM IST