తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 మహిళా ప్రపంచకప్: టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బ్యాటింగ్ - Women's T20 World Cup 2020 IND AUS

టీమిండియాతో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్​లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నాయి.

మ్యాచ్
మ్యాచ్

By

Published : Feb 21, 2020, 1:06 PM IST

Updated : Mar 2, 2020, 1:37 AM IST

ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన మహిళా టీ20 ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్​లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.

మిథాలీ లేకుండా.. తొలిసారి

టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి భారత జట్టు దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ లేకుండా బరిలోకి దిగుతోంది. 2009లో తొలి ప్రపంచకప్‌ నుంచి వరుసగా ఆరు టోర్నీల్లోనూ ఆమె బరిలోకి దిగింది. అయితే గత కప్పులో సెమీఫైనల్‌కు మిథాలీని తుది జట్టులోకి తీసుకోకపోవడం దుమారం రేపింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో మిథాలీ ఉంటే భారత్‌ గెలిచేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది ఆమె టీ20లకు గుడ్‌బై చెప్పింది. గత టోర్నీలో సారథిగా వ్యవహరించిన హర్మన్‌ప్రీతే ఈసారి కూడా జట్టును నడిపించనుంది.

తుది జట్లు

ఆస్ట్రేలియా

మెగ్ లానింగ్ (కెప్టెన్), అలిసా హేలీ (కీపర్), బెత్ మూనీ, గార్డ్​నర్, ఎలిస్ పెర్రీ, రాచెల్ హైనెస్, అన్నాబెల్ సూథర్​లాండ్, జెస్ జోనాసెన్, దెలిసా కిమ్మిన్స్, మొల్లీ స్ట్రానో, మెగాన్ స్కాట్

భారత్

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమ్మీ రోడ్రిగ్స్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, తానియా భాటియా (కీపర్), అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్

Last Updated : Mar 2, 2020, 1:37 AM IST

ABOUT THE AUTHOR

...view details