తెలంగాణ

telangana

By

Published : Feb 23, 2020, 12:54 PM IST

Updated : Mar 2, 2020, 7:10 AM IST

ETV Bharat / sports

ఏ క్రికెటర్​కూ దక్కని రికార్డు 'డివైన్​' సొంతం

మహిళా టీ20 ప్రపంచకప్​లో న్యూజిలాండ్​ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్​-ఎ మ్యాచ్​లో శ్రీలంకపై​ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో అర్ధశతకంతో రాణించిన సోఫీ డివైన్​ అరుదైన రికార్డు నెలకొల్పింది.

Devine's sixth T20I fifty
అబ్బాయిలకే అందని రికార్డు 'డివైన్​' సొంతం'

ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న మహిళా టీ20 ప్రపంచకప్​లో.. న్యూజిలాండ్​ బోణీ కొట్టింది. శనివారం శ్రీలంకతో జరిగిన గ్రూప్​ దశ పోరులో.. కివీస్​ 7 వికెట్ల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్​ కెప్టెన్‌ సోఫీ డివైన్‌ 75*(55 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్సర్​) అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. ఈ క్రమంలో ఆమె ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.

ఒకే ఒక్క ప్లేయర్​...

ఈ మ్యాచ్​లో ప్రదర్శనతో కెరీర్​లో మరో అర్ధశతకం సాధించిన డివైన్​.. వరుసగా ఆరు హాఫ్​ సెంచరీలు చేసిన క్రికెటర్​గా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్​లో (పురుష, మహిళా) 4 అర్ధశతకాలకు మించి వరుసగా ఎవరూ చేయలేదు.

సోఫీ డివైన్‌

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్‌ చమరి ఆటపట్టు 41(5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్. మిగతా అందరూ నిరాశపర్చారు. కివీస్​ బౌలర్​ జెన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్‌ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించింది. డివైన్​కు తోడు మ్యాడీ గ్రీన్‌ 29(20 బంతుల్లో; 2 ఫోర్లు, 1 సిక్సర్​) దూకుడుగా ఆడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఈ క్రమంలో డివైన్‌ 46 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంది. ఫలితంగా న్యూజిలాండ్​ జట్టు 7 వికెట్లు తేడాతో గెలచి మెగాటోర్నీని ఘనంగా ఆరంభించింది.

Last Updated : Mar 2, 2020, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details