ఐపీఎల్ అనంతరం జరగబోయే మహిళల టీ20 ఛాలెంజర్ టోర్నీ (మినీ ఐపీఎల్)పై స్పష్టత వచ్చింది. ఈ టోర్నీని షార్జా వేదికగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. మూడు జట్లు తలపడే మినీ ఐపీఎల్‌లో పాల్గొనే భారత క్రికెటర్లందరూ ఈనెల 13 కల్లా ముంబయికి రావాలని బోర్డు సమాచారం ఇచ్చింది. ముంబయికి వచ్చిన తర్వాత వీళ్లు వారం రోజులు క్వారంటైన్‌లో ఉంటారని.. ఆ తర్వాత అక్టోబర్ 22న యూఏఈకి బయల్దేరే అవకాశం ఉందని సమాచారం.
షార్జా వేదికగా మహిళల మినీ ఐపీఎల్! - దుబాయ్లో మహిళా టీ20
ఐపీఎల్ తర్వాత షార్జా వేదికగా మినీ ఐపీఎల్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈనెల 22వ తేదీకి మహిళా క్రికెటర్లందరూ యూఏఈకి బయల్దేరే అవకాశం ఉంది.
![షార్జా వేదికగా మహిళల మినీ ఐపీఎల్! mini ipl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9119372-677-9119372-1602293099985.jpg)
మినీ ఐపీఎల్