తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మహిళా టీ20 లీగ్​ మరింత గ్రాండ్​గా...' - wipl

మహిళా టీ20 లీగ్​ను కైవసం చేసుకుంది హర్మన్​ప్రీత్ సేన. టోర్నీ మరిన్ని రోజులుంటే బాగుంటుందని అభిప్రాయపడింది జట్టు సారథి.

హర్మన్​ప్రీత్ కౌర్

By

Published : May 12, 2019, 2:26 PM IST

శనివారం జరిగిన మహిళల టీ20 ఫైనల్లో హర్మన్​ప్రీత్ సారథ్యంలోని సూపర్​నోవాస్... మిథాలీ కెప్టెన్సీలోని వెలాసిటీని ఓడించింది. టైటిల్ గెలిచింది. టోర్నీలో విజయం చాలా సంతోషకరమని.. ఇంకా ఎక్కువ జట్లు, ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది హర్మన్​ప్రీత్.

చివరి మ్యాచ్​లో 51 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది హర్మన్. మొదటి సారి నిర్వహించిన లీగ్​ టైటిల్ గెలవడం సంతోషంగా ఉందని తెలిపింది.

"టోర్నీ చాలా సంతృప్తినిచ్చింది. ఈ లీగ్ ద్వారా చాలా నేర్చుకున్నా. కానీ వచ్చే లీగ్​లో మరిన్ని జట్లను ఏర్పాటు చేసి.. ఎక్కువ రోజులు నిర్వహిస్తే బాగుంటుంది. విదేశీ ఆటగాళ్లూ మరిన్ని రోజులు టోర్నీ ఉంటే బాగుండేదని అన్నారు". -హర్మన్​ప్రీత్​

యువ ఆటగాళ్లు రాధా యాదవ్, రోడ్రిగ్స్, దీప్తి శర్మలకు మంచి భవిష్యత్ ఉందని తెలిపింది. ఇతర లీగ్​లలోనూ వారు సత్తాచాటి జాతీయ స్థాయిలోనూ రాణించాలని సూచించింది.

ఇవీ చూడండి.. ఐపీఎల్: ముంబయి మళ్లీ మాయ చేస్తుందా?

ABOUT THE AUTHOR

...view details