స్మృతి మంధాన (68; 49 బంతుల్లో, 5×4, 3×6) అర్ధశతకంతో విజృంభించిన వేళ సూపర్‌నోవాస్‌కు ట్రయల్ బ్లేజర్స్ 119 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఓపెనర్లు డాటిన్ (20; 32 బంతుల్లో, 1×4), స్మృతి శుభారంభం అందించారు.
మెరిసిన స్మృతి.. ట్రయల్ బ్లేజర్స్ లక్ష్యం 119 - సూపర్ నోవాస్-ట్రయల్ బ్లేజర్స్
సూపర్ నోవాస్‌తో జరుగుతోన్న మహిళా టీ20 ఛాలెంజ్ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన 68 పరుగులతో రాణించినా మిగతావారు ఆకట్టుకోలేకపోయారు.

డాటిన్ నిదానంగా.. స్మృతి దూకుడుగా ఆడటం వల్ల ఆ జట్టు పవర్‌ప్లేలో 45 పరుగులు చేసింది. అయితే డాటిన్‌ను పూనమ్ బోల్తా కొట్టించింది. దీంతో 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా (10)తో కలిసి స్మృతి స్కోరుబోర్డు ముందుకు నడిపించింది. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసింది. అయితే సూపర్‌నోవాస్ బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు సాధించి స్కోరుకు కళ్లెం వేశారు. ఆఖరి ఓవర్‌లో స్మృతిసేన ఒక్క పరుగు వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ట్రయల్‌బ్లేజర్స్ బ్యాటర్లలో దీప్తి (9), హర్లీన్ (4), సోఫియా (1), జులన్ గోస్వామి (1) పరుగులు చేశారు. హర్మన్‌సేన బౌలర్లలో రాధ ఐదు, పూనమ్, శశికల చెరో వికెట్ తీశారు.