తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి జట్టు అద్భుతం- 4 బంతుల్లోనే లక్ష్య ఛేదన - 4 బంతుల్లోనే లక్ష్య ఛేదన

దేశవాళీ మహిళా క్రికెట్లో అద్భుతం జరిగింది. ఇందోర్ వేదికగా నాగాలాండ్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి జట్టు కేవలం నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత నాగాలాండ్​ను 17 పరుగులకు ఆలౌట్​ చేసింది ముంబయి టీమ్​.

womens-odi-nagaland-all-out-for-17-mumbai-chase-down-target-in-4-balls
ముంబయి జట్టు అద్భుతం.. 4 బంతుల్లోనే లక్ష్య ఛేదన

By

Published : Mar 17, 2021, 3:42 PM IST

Updated : Mar 17, 2021, 10:22 PM IST

దేశవాళీ క్రికెట్లో ముంబయి మహిళల జట్టు అద్భుతం చేసింది. ప్రత్యర్థి జట్టును 17 పరుగులకే ఆలౌట్‌ చేయడమే కాకుండా కేవలం 4 బంతుల్లోనే ఛేదనను ముగించేసింది. సీనియర్‌ వన్డే ట్రోఫీ లీగ్‌ మ్యాచుకు ఆతిథ్యమిచ్చిన ఇందోర్‌ ఇందుకు వేదికైంది.

హోల్కర్‌ స్టేడియం వేదికగా ముంబయి, నాగాలాండ్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన నాగాలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడమే వారి కొంప ముంచింది. ముంబయి సారథి, మీడియం పేసర్‌ సయాలీ సత్ఘరె (7/5, 8.4 ఓవర్లలో) వారిని బెంబేలెత్తించింది. కేవలం 5 పరుగులిచ్చి 7 వికెట్లు తీసింది. ఆమెకు తోడుగా ఎస్‌. థాకోర్‌ (1/0), దాక్షిణి (2/12) ఆధిపత్యం చెలాయించారు. దాంతో నాగాలాండ్‌ టాప్‌ ఆర్డర్‌లో కికయంగ్లా (0), జ్యోతి (0), సారథి సెంటిలెమ్లా (0), ఎలీనా (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరిపోయారు. ఆ జట్టులో కనీసం ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఏడో స్థానంలో ఆడిన సరిబా (9) టాప్‌ స్కోరర్‌.

స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి కేవలం 4 బంతుల్లోనే ఆటను ముగించింది. ఓపెనర్‌ ఇషా ఓజా, వృషాలీ భగత్‌ కలిసి మూడు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేశారు. 49.2 ఓవర్లు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగరేశారు.

స్కోరు వివరాలు: నాగాలాండ్‌ 17.4 ఓవర్లల్లో 17 పరుగులకు ఆలౌట్‌. ముంబయి 0.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు.

ఇదీ చదవండి:టాస్ గెలిస్తే టీ20 ప్రపంచకప్ గెలిచినట్లే: వాన్

Last Updated : Mar 17, 2021, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details