మార్చి 11 నుంచి 50 ఓవర్ల టోర్నమెంట్‌తో మహిళల దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమాచారమిచ్చింది.
సూరత్, రాజ్ కోట్, జైపుర్, ఇండోర్, చెన్నై, బెంగళూరు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4 కల్లా జట్లు సంబంధిత వేదికలకు చేరుకొని మూడు సార్లు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బీసీసీఐ ఆదేశించింది.