తెలంగాణ

telangana

ETV Bharat / sports

బిగ్​బాష్ విజేతగా బ్రిస్బేన్ హీట్.. వరుసగా రెండో టైటిల్ - బిగ్​బాష్​ లీగ్ 2019

ఆస్ట్రేలియా మహిళల బిగ్​బాష్​ లీగ్ ఫైనల్లో అడిలైడ్ స్ట్రైకర్స్​పై 6 వికెట్ల తేడాతో నెగ్గిన బ్రిస్బేన్ హీట్​ జట్టు.. వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ఈ సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన సోఫీ డివైన్​కు(769) ప్లేయర్​ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకుంది.

womens bigbash league winner is Brisbane heat
బిగ్​బాష్ విజేతగా బ్రిస్బేన్ జట్టు.. వరుసగా రెండో సారి కైవసం

By

Published : Dec 8, 2019, 5:00 PM IST

Updated : Dec 8, 2019, 5:06 PM IST

మహిళల బిగ్​బాష్​ లీగ్ 5వ సీజన్ విజేతగా బ్రిస్బేన్ హీట్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్ స్ట్రైకర్స్​పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండో టైటిల్ ఎగరేసుకుపోయింది బ్రిస్బేన్. అడిలైడ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది.

ఈ మ్యాచ్​లో అర్ధశతకంతో ఆకట్టుకున్న బ్రిస్బేన్ క్రీడాకారిణి బెత్(56) మూనీకి ప్లేయర్​ ఆఫ్ ద మ్యాచ్​ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో అత్యధికంగా 769 పరుగులు చేసిన సోఫీ డివైన్​కు(అడిలైడ్) ప్లేయర్​ ఆఫ్ ద సిరీస్ పురస్కారం లభించింది. 16 ఇన్నింగ్స్​ల్లో 76.90 సగటుతో ఈ స్కోరు సాధించింది సోఫీ.

సోఫీ డివైన్

మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులో అమాండా వెల్లింగ్టన్(55), తహిలా మెక్​గ్రాత్(33) మినహా మిగతా బ్యాట్స్​ఉమెన్ విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. బ్రిస్బేన్ బౌలర్లలో జార్జియా, జెస్ జొనాసెన్ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన బ్రిస్బేన్ జట్టులో ఓపెనర్ బెత్ మూనీ అర్ధశతకంతో అదరగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ మెరిసింది జెస్​. 33 పరుగులతో చక్కటి ప్రదర్శన చేసింది. అడిలైడ్ బౌలర్లలో తహిలా మెక్​గ్రాత్ 2, సారా, సోఫీ డివైన్ చెరో వికెట్ తీశారు.

ఇదీ చదవండి: కోహ్లీ ముంగిట మరో రికార్డు... 25 పరుగుల దూరంలోనే.

Last Updated : Dec 8, 2019, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details