తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాప్​-10లో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు

ఐసీసీ ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానం నిలబెట్టుకుంది​ స్మృతి మంధాన. మరో క్రికెటర్ మిథాలీ రాజ్​.. ఒక్క స్థానం కోల్పోయి ఆరులో నిలిచింది.

మహిళా వన్డే ర్యాంకింగ్స్​: టాప్​-10లో ఇద్దరు భారత క్రికెటర్లు

By

Published : Sep 13, 2019, 1:19 PM IST

Updated : Sep 30, 2019, 11:01 AM IST

వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​లో ఉన్న భారత మహిళా క్రికెటర్స్మృతి మంధాన.. ఐసీసీ గురువారం ప్రకటించిన తాజా జాబితాలోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈమె ఖాతాలో ప్రస్తుతం 802 పాయింట్లు ఉన్నాయి. 36 పాయింట్ల అంతరంతో రెండో స్థానంలో ఉంది ఎల్లీస్​ పెర్రీ(ఆస్ట్రేలియా). అదే దేశానికి చెందిన శాటర్త్​వైట్​(759)ను మూడో ర్యాంక్​కు నెట్టి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుందీ క్రికెటర్.

తగ్గిన మిథాలీ...

ఆస్ట్రేలియాకు చెందిన హేలీ (734 పాయింట్లు) మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగులో నిలిచింది. ఇంగ్లాండ్​ క్రికెటర్ బ్యూమాంట్​ (722) ఒక్క స్థానం కోల్పోయి ఐదుకు చేరుకుంది. ఇటీవల టీ20 క్రికెట్​కు వీడ్కోలు పలికిన టీమిండియా సారథి మిథాలీరాజ్.. ఒక స్థానం దిగి​ ఆరులో ఉంది.

టాప్​-10లో భారత్​ నుంచి ఇద్దరే ఉండగా... ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆరుగురు ఉండటం విశేషం.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details