తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల టీ20 ఫైనల్​: మిథాలీ X హర్మన్​ - harmanpreet kaur

నేడు మహిళల టీ20 ఛాలెంజ్​ ఫైనల్​ పోరులో వెలాసిటీ, సూపర్ నోవాస్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. వెలాసిటీ జట్టుకు మిథాలీ రాజ్​ కెప్టెన్​గా ఉంది. బ్లేజర్స్​ జట్టుకు హర్మన్​ ప్రీత్​ సారథ్యం వహిస్తోంది.

ఉమెన్ ఐపీఎల్

By

Published : May 11, 2019, 8:20 AM IST

మహిళల టీ20 ఛాలెంజ్​లో తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ట్రయల్‌ బ్లేజర్స్, వెలాసిటీ, సూపర్‌ నోవాస్‌ మూడు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్‌ దశలో ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్‌ గెలిచాయి. రెండేసి పాయింట్లతో సమంగా నిలిచినా అన్ని జట్లలో నెట్‌ రన్‌రేట్‌లో వెనుకబడిన ట్రయల్‌ బ్లేజర్స్‌ ఫైనల్‌కు దూరమైంది. నేటి రాత్రి 7.30 గంటలకు ఫైనల్మ్యాచ్ జరుగునుంది.

నేడు జరుగనున్న ఫైనల్లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని వెలాసిటీ, హర్మన్​ ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ తలపడనున్నాయి. బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు కట్టిదిట్టంగా బౌలింగ్​ చేయడం వల్ల హర్మన్, జెమీమా రోడ్రిగ్స్, హేలీ వంటి హిట్టర్లున్నా స్వల్ప స్కోర్లే నమోదవుతున్నాయి. 150 దాటడమే కష్టమవుతోంది. ఈ స్కోర్లను ఛేదించేందుకూ కష్టపడాల్సి వస్తుండటం వల్ల ఉత్కంఠకు కొదవలేదు.

నేటి తుదిపోరు రసవత్తరంగా జరుగనుంది. టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ (వెలాసిటీ) ఎలా ఆడుతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోడ్రిగ్స్, హర్మన్‌లకు తోడు సోఫియా డివైన్‌లతో సూపర్​నోవాస్ బ్యాటింగ్ లైనప్ బాగుంది. వెలాసిటీ జట్టులో మిథాలీ, వేదా కృష్ణమూర్తి, హేలీలాంటి అనుభవజ్ఞులున్నారు. గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఇదే జట్టుపై సాధించిన గెలుపు నోవాస్‌కు సానుకూలాంశం.

ఇవీ చూడండి.. శ్రీలంక మాజీ ఆటగాళ్లపై ఐసీసీ సస్పెన్షన్​...!

ABOUT THE AUTHOR

...view details