చివరి వన్డేలో ఓడినా న్యూజిలాండ్‌పై సిరీస్ గెలుచుకుంది మహిళల టీమిండియా జట్టు. అదే ఓటమి టీట్వంటీల్లో పునరావృతం కాకుడదని చూస్తుంది. రేపటి నుంచి మొదలు కాబోయే టీట్వంటీ సిరీస్‌ను ఎలాగైనా చేజెక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఫిబ్రవరి 1న జరిగిన చివరి వన్డేలో బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే ఆలౌటై.. మ్యాచ్‌ను చేజార్చుకుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్, వన్డేల్లో చోటు దక్కించుకోలేక పోయింది. ప్రస్తుతం జరగబోయే టీట్వంటీలకు నేతృత్వం వహించనుంది.
ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ టీట్వంటీ కప్ సెమీస్‌లో భారత్ పరాజయం తర్వాత ఆడుతున్న టీట్వంటీ మ్యాచ్ ఇదే. అప్పుడు కోచ్ రమేశ్ పొవార్ విషయంలో గొడవ జరగడం, ఆ తర్వాత కొత్త కోచ్‌గా డబ్యూ.వి.రామన్ నియమితులవ్వడం జరిగింది.
పొట్టి ఫార్మాట్లో మిథాలీ స్ట్రైక్ రేట్ ఏమంత గొప్పగా లేదు. మూడో వన్డేలో కూడా స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎదుర్కొలేక పోయింది. ఆ విషయంలో కొంచెం మెరుగు పరుచుకోవాలి.