తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్: కోహ్లీసేన జోరును ఇంగ్లాండ్ ఆపగలదా?

భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. పుణె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​లో గెలుపు కోసం ఇరుజట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

By

Published : Mar 25, 2021, 6:31 PM IST

With series win in sight, India gear up for 'Surya Namaskar'
జోరు మీద టీమ్ఇండియా.. పరువు కోసం ఇంగ్లాండ్

పుణె వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తుండగా.. పరువు దక్కించుకోవాలని ఇంగ్లీష్‌ జట్టు పట్టుదలతో ఉంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న ఇరుజట్ల మధ్య ఈ పోరు రసవత్తరంగా సాగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

గాయాల బెడద

టీమ్ఇండియా కీలక ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ భుజం గాయంతో తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో టీ20ల్లో సత్తా చాటిన సూర్య కుమార్‌యాదవ్‌ ఈ మ్యాచ్‌ ద్వారా వన్డే అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌, మరో బ్యాట్స్‌మన్‌ సామ్‌ బిల్లింగ్స్‌ రెండో మ్యాచ్‌లో ఆడడం సందేహమేనని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

కోహ్లీ, మోర్గాన్

ఫామ్​లో టీమ్ఇండియా

జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌ అందరూ ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తొలి వన్డేలో అదరగొట్టగా.. టీ20ల్లో విఫలమైన రాహుల్‌ మొదటి వన్డేలో చెలరేగడం వల్ల జట్టు యజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌ గాయంతో దూరం కాగా.. ఈ స్థానాన్ని సూర్యకుమార్‌ యాదవ్‌తో భర్తీచేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో ఓపెనర్‌ రోహిత్‌కు అయిన గాయం పెద్దది కాకపోవడం వల్ల జట్టు ఊపిరి పీల్చుకుంది. ఒకవేళ.. రోహిత్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తే.. ధావన్‌తో పాటు శుభమన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో.. స్పిన్నర్‌ కోటాను చాహల్‌తో భర్తీ చేయవచ్చు. పాండ్యా సోదరులతో ఆల్‌రౌండర్ల కోటా బలంగా ఉంది. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్‌తో పాటు.. ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్దుల్‌ ఠాకూర్‌తో పేస్‌దళం పటిష్ఠంగా కనిపిస్తోంది. కొన్ని నెలలుగా నిర్విరామంగా ఆడుతున్న శార్దూల్‌ స్థానంలో.. నటరాజన్‌ లేదా సిరాజ్‌ను ఆడించే అవకాశాలు లేకపోలేదని జట్టు వర్గాలు అంటున్నాయి.

టీమ్ఇండియా

తడబాటుకు చెక్​ పెడతారా?

టెస్టు, టీ20 సిరీస్‌లు ఓడిపోయిన ఇంగ్లాండ్‌ జట్టు.. వన్డే సిరీస్‌ కైవసం చేసుకోవాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాలి. తొలి వన్డేలో.. ఓపెనర్లు బెయిర్‌స్టో, జాసన్‌ రాయ్‌ సృష్టించిన విధ్వంసం తర్వాత కూడా.. ఆ జట్టు మ్యాచ్‌ ఓడిపోయిందంటే, అందుకు మిడిలార్డర్‌ వైఫల్యమే కారణం. 14 ఓవర్లలోనే 135 పరుగులు చేసిన ఈ ద్వయం మరోసారి చెలరేగాలని ఇంగ్లాండ్‌ కోరుకుంటోంది. స్టోక్స్‌, మోర్గాన్‌, మెయిన్‌ అలీలతో ఆ జట్టు మిడిలార్డర్‌ బలంగా ఉంది. వీరు కూడా చెలరేగి ఆడితే.. గెలుపు ఖాయమని ఇంగ్లీష్‌ జట్టు భావిస్తోంది. ఆ జట్టు స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, మెయిన్‌ అలీలు తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపలేదు. పేస్‌దళం టామ్‌ కరన్‌, సామ్‌ కరన్‌, మార్క్‌ వుడ్‌లతో బలంగానే ఉంది. కీలక సమయాల్లో పుంజుకోకపోవడం వల్లే తొలి వన్డేలో ఓటమి పాలైనట్లు ఇంగ్లాండ్‌ భావిస్తోంది. ఇలాంటి పొరపాట్లను పునరావృతం కానీయకూడదని జట్టు యజమాన్యం కోరుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details