తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేను మోనార్క్​ని.. నన్ను మన్కడింగ్ చేయలేవు' - వార్నర్

పంజాబ్-హైదరాబాద్ మధ్య ఐపీఎల్ మ్యాచ్​లో మరోసారి మన్కడింగ్ అంశం చర్చకు వచ్చింది. వార్నర్ చూపించిన సమయస్ఫూర్తి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఐపీఎల్

By

Published : Apr 9, 2019, 1:50 PM IST

ఐపీఎల్​లో మన్కడింగ్ వివాదం​పై వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఈ విషయంలో వార్నర్ చూపిన సమయస్ఫూర్తిపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింగ్స్​ ఎలెవన్ పంజాబ్-సన్ రైజర్స్ హైదరాబాద్​మ్యాచ్​లో జరిగిందీ ఘటన.

మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ఆరో ఓవర్ రెండో బంతి. నాన్ స్ట్రైకర్ ఎండ్​లో ఉన్నాడువార్నర్. అశ్విన్ బౌలింగ్. మన్కడింగ్​కు ఏ మాత్రం అవకాశమివ్వని వార్నర్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. అశ్విన్ చేతిలోనుంచి బంతి వదిలే వరకు బ్యాటుని క్రీజులోనే ఉంచాడు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇవీ చూడండి.. 'సింగపూర్​ ఓపెన్'పైనే భారత షట్లర్ల ఆశలు ​

ABOUT THE AUTHOR

...view details