క్రికెట్‌లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు మాజీ సారథి సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాల్సిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో నియమితమవుతున్న గంగూలీకి యువీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘
"గొప్ప వ్యక్తి ప్రయాణం ఇంకా గొప్పగా ఉంటుంది. భారత జట్టు సారథి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎదగడం ఎంతో గొప్ప విషయం. ఒక పాలకుడిగా ఆటగాళ్ల దృక్కోణాన్ని ఇతరులకు వివరించే వీలుంటుంది. యోయో పరీక్ష అవసరమైనప్పుడు దాదా ప్రెసిడెంట్‌గా ఉంటే బాగుండేది"
-యువరాజ్, టీమిండియా మాజీ ఆటగాడు
యువీ ట్వీట్‌కు స్పందించిన గంగూలీ అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా అభిర్ణించాడు.
"భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించావు. ఆటకోసం మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిన సమయమిది. నువ్వు నా సూపర్‌స్టార్. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి"
-గంగూలీ, టీమిండియా మాజీ సారథి
జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు యువరాజ్. ఇటీవల ఈ ఆటగాడు మీడియాతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్‌కు గల కారణాలు, యోయో టెస్టు వైఫల్యాన్ని వివరించాడు. తన లాంటి సీనియర్ ఆటగాళ్లను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన చెందాడు.
ప్రస్తుతం యువీ విదేశీ లీగులపై దృష్టిసారించాడు. ఇదివరకు కెనడా గ్లోబల్ లీగ్‌లో పాల్గొన్న అతడు త్వరలో జరిగే అబుదాబి టీ10 లీగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇవీ చూడండి.. కొనసాగుతోన్న రోహిత్ రికార్డుల వేట