తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీలాంటి కెప్టెన్ పాక్​కు ఉంటే బాగుండు' - కమ్రన్ అక్మల్ ధోనీ

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు పాకిస్థాన్ జట్టు మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్. అలాంటి గొప్ప సారథికి సచిన్​లాగా ఘనమైన వీడ్కోలు లభించాలని తెలిపాడు. అతడిలాంటి కెప్టెన్​ భవిష్యత్​లో పాక్​ జట్టుకు ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

'ధోనీలాంటి కెప్టెన్ పాక్​కు ఉంటే బాగుండు'
'ధోనీలాంటి కెప్టెన్ పాక్​కు ఉంటే బాగుండు'

By

Published : Aug 20, 2020, 12:27 PM IST

Updated : Aug 20, 2020, 12:39 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్​తో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. టీమ్​ఇండియాకు రెండు ప్రపంచకప్​లు అందించిన గొప్ప సారథి ఇలా అర్ధాంతరంగా వీడ్కోలు పలకడం సమంజసం కాదంటూ మాజీలు అభిప్రాయపడ్డారు. మహీకి కచ్చితంగా ఫేర్ వెల్ గేమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. తాజాగా పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మక్ కూడా ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు. అలాంటి గొప్ప కెప్టెన్​కు సచిన్​లాగా ఆఖరి మ్యాచ్ ఏర్పాటు చేయాలని తెలిపాడు.

"జట్టును ధోనీ సుదీర్ఘం కాలం పాటు ముందుకు నడిపించాడు. జట్టులో యువ ఆటగాళ్లకు చోటు కల్పించి భవిష్యత్​పై భరోసా కలిగించాడు. అందుకే టీమ్​ఇండియా ఇప్పటికీ నెంబర్ వన్ టీమ్​గా ఉంది. అలాంటి ఆటగాళ్లు ఇలా నిష్క్రమించడం సరికాదు. మైదానంలో అతడికి ఘనమైన వీడ్కోలు లభించాలి. సచిన్​లాగా ధోనీకి ఫేర్ వెల్ గేమ్ ఏర్పాటు చేయాలి."

-కమ్రన్ అక్మల్, పాక్ మాజీ ఆటగాడు

ధోనీ లాంటి కెప్టెన్​లు అవసరమని తెలిపాడు కమ్రన్. "పాకిస్థాన్​ జట్టుకు ఇంజమాన్ ఉల్ హక్, యూనిస్ ఖాన్ వంటి గొప్ప సారథులు ఉన్నారు. ధోనీ ఎందరో కెప్టెన్​లకు ఆదర్శంగా నిలిచాడు. మహీ లాంటి చాతుర్యం ఉన్న కెప్టెన్​ పాక్​ జట్టుకు అవసరం" అని అక్మల్ తెలిపాడు.

Last Updated : Aug 20, 2020, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details