తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి వన్డే: టాస్ గెలిచిన విండీస్.. భారత్ బ్యాటింగ్ - Ind Vs Wi Toss

చెన్నై వేదికగా భారత్​తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో నెగ్గి సిరీస్​ను ఘనంగా ఆరంభించాలనుకుంటున్నాయి ఇరు జట్లు.

windies won the toss chose to bowling against india
భారత్ - విండీస్

By

Published : Dec 15, 2019, 1:13 PM IST

భారత్​తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. ఇటీవలి మ్యాచ్​లను పరిశీలిస్తే.. ఈ మైదానంలో సగటున 250 నుంచి 270 పరుగులు నమోదవుతున్నాయి.

ఇందులో గెలిచి సిరీస్​లో శుభారంభం చేయాలనుకుంటున్నాయి ఇరు జట్లు. ఇటీవలే టీ20 సిరీస్ నెగ్గిన భారత్.. జోరు కొనసాగించాలనుకుంటోంది. పొట్టి ఫార్మాట్లో పరాభవం చెందిన విండీస్​.. వన్డేల్లోనైనా నెగ్గి విజయంతో స్వదేశం వెళ్లాలనుకుంటోంది.

జట్లు..

భారత జట్టు:

రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, రిషబ్​ పంత్​(కీపర్​), కేదార్​ జాదవ్​, శివం దూబే, రవీంద్ర జడేజా, దీపక్​ చాహర్​, కుల్దీప్​ యాదవ్​, మహ్మద్​ షమి.

వెస్టిండీస్​ జట్టు:షై హోప్​, సునిల్​ ఆంబ్రిస్​, షిమ్రన్​ హెట్​మెయిర్​, రోస్టన్​ ఛేజ్​, నికోలస్ పూరన్​(కీపర్), కీరన్​ పొలార్డ్​(కెప్టెన్​), జేసన్​ హోల్డర్​, కీమో పాల్​, షెల్డన్​ కాట్రెల్​, హేడెన్​ వాల్ష్​, అల్జారీ జోసెఫ్.​

ఇదీ చదవండి: వాన్​ ట్వీట్​పై రగడ.. కౌంటర్ ఇస్తున్న మాజీలు

ABOUT THE AUTHOR

...view details