మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్-వెస్టిండీస్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. రేసులో నిలవాలంటే వెస్టిండీస్ తప్పక గెలివాల్సిన పరిస్థితి. వరుస విజయాలు సాధిస్తున్న కివీస్‌ను కరీబియన్ జట్టు అడ్డుకుంటుందా అనేదే ప్రశ్న.
తన ఆరంభ మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించింది వెస్టిండీస్. తర్వాత ఆడిన అన్నింట్లోనూ ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది హోల్డర్ సేన. సెమీస్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. బ్యాటింగ్‌లో రాణిస్తున్నా.. బౌలింగ్ వైఫల్యం కరీబియన్ జట్టును వెంటాడుతోంది.
మరోవైపు ఆడిన ఐదింటిలో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది కివీస్. భారత్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది విలియమ్సన్ బృందం.