బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయంలో కేల్ మేయర్స్(40,210*) కీలకంగా వ్యవహరించాడు. విండీస్‌కు 395 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చిన బంగ్లాదేశ్‌కు తమ గడ్డపైనే ఆరంగ్రేటం ఆటగాడు కేల్ మేయర్స్ అదిరిపోయే షాక్ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన అతడు.. నాలుగో ఇన్నింగ్స్‌లో అజేయ ద్విశతకం బాది, విండీస్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోరు చేసిన బంగ్లాదేశ్.. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో 395 భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది బంగ్లా. అనంతరం నాలుగో ఇన్నింగ్స్‌లో 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది విండీస్. ఆ దశలో క్రీజులోకి వచ్చిన కేల్ మేయర్స్ తమ జట్టును అద్భుతంగా ఆదుకున్నాడు. 310 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 210 పరుగులు చేసి విండీస్‌కు విజయాన్ని అందించాడు.