న్యూజిలాండ్- వెస్టిండీస్ మ్యాచ్ హైలేట్స్ చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 5 పరుగులు తేడాతో గెలిచింది న్యూజిలాండ్. ఛేదనలో విండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్ శతకం చేసిన ఫలితం లేకపోయింది. ఈ ఓటమితో సెమీస్ రేసు నుంచి వైదొలగింది కరీబియన్ జట్టు.
గెలిచిన ఆనందలో కివీస్ జట్టు టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అద్భుతంగా ఆడిన కెప్టెన్ విలియమ్సన్ 148 పరుగులు వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. రాస్ టేలర్ 69 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ 4, గేల్ 1, బ్రాత్‌వైట్ 2 వికెట్లు తీశారు.
న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 292 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో గేల్ 87, హెట్మయిర్ 54 పరుగులు చేశారు. 164 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన బ్రాత్‌వైట్ జట్టును గెలిపించే స్థితికి చేర్చాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో సెంచరీ నమోదు చేశాడు.
కివీస్ బౌలర్లో బౌల్ట్ 4, ఫెర్గుసన్ 3, హెన్రీ, నీషమ్, గ్రాండ్‌హామ్ తలో వికెట్ దక్కించుకున్నాడు.
ఇది చదవండి: అమ్మో అఫ్గాన్- ఉత్కంఠ పోరులో భారత్ గెలుపు