ఐపీఎల్లో ఆడేటప్పుడు స్టేడియంలోని అభిమానుల ఉత్సాహం వల్ల తమకు శక్తి లభిస్తుందని చెప్పిన దినేశ్ కార్తిక్.. ఈసారి కరోనా వల్ల దానిని మిస్ అవుతున్నట్లు చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా, ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన మ్యాచ్‌లను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.
"ఈడెన్ గార్డెన్స్‌లో మా అభిమానులు ఇచ్చే శక్తిని ఈ ఏడాది కోల్పోనున్నాం. అందువల్ల కోల్‌కతా ఫ్యాన్స్‌తో మేం మమేకమవ్వాలని భావిస్తున్నాం. వారు ప్రస్తుతం మైదానాల్లో లేకపోయినా, ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతారు"
- దినేశ్ కార్తిక్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథి
అభిమానులతో చర్చించడంలో భాగంగా 'తూ ఫ్యాన్ నహి తుపాన్ హై' అనే కార్యక్రమాన్ని పాల్గొన్నాడు దినేశ్ కార్తిక్. కరోనా వల్ల ఐపీఎల్‌ను యూఏఈలో జరుపుతున్న తరుణంలో కోల్‌కతా ఫ్యాన్స్‌తో వర్చువల్‌గా జట్టు మొత్తం మాట్లాడటానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పశ్చిమ బంగా రాష్ట్రం ఈ ఏడాది రెండు ప్రకృతి విపత్తులను ఎదుర్కొంది. అందులో మొదటిది కరోనా వైరస్ కాగా రెండోది తుపాను. ఇన్నాళ్లు కోల్‌కతా ప్రజలు తమ జట్టుకు అండగా ఉన్నారని .. ప్రస్తుతం వారి ముఖంలో ఆనందం కోసం ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఇవ్వడమే తమ కర్తవ్యమని దినేశ్ కార్తిక్ అన్నాడు.
ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి మ్యాచ్‌లో భాగంగా సెప్టెంబరు 23న ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.