టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో మహీ ధరించిన నెం.7 జెర్సీకి.. బీసీసీఐ రిటైర్మెంట్ పలుకుతుందా? లేదా ఆ నంబరును మరొకరికి కేటాయిస్తుందా? అనేది భారీ సంఖ్యలో నెటిజన్ల మదిలో మెదులుతోన్న ప్రశ్న. అయితే తాజాగా ఈ ప్రశ్నను మొదటగా టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ లేవనెత్తాడు. ఈ నెంబరుకు బోర్డు రిటైర్మెంట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశాడు.
గతేడాది న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో తనతో కలిసి మహీ దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు కార్తిక్. "ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా ఇద్దరి మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. తెల్లబంతి క్రికెట్లో బీసీసీఐ నెం.7 జెర్సీని రిటైర్మెంట్ ప్రకటిస్తుందని భావిస్తున్నా. జీవితంలో ధోనీకి రెండో ఇన్నింగ్స్ సాఫీగా సాగాలని కోరుకుంటున్నా. మరిన్ని అద్భుతాలు చూస్తావని అనుకుంటున్నా" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు.
2004లో అరంగేట్రం చేసిన కార్తిక్.. ఇప్పటివరకు తన కెరీర్లో 26 టెస్టులు, 94 వన్డేలు, 32టీ20లు ఆడాడు.