ఐపీఎల్ సీజన్ వాయిదా పడి, అభిమానుల్ని నిరాశపర్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్ నిర్వహిస్తే, ఇబ్బందులు ఎదురువుతాయని బీసీసీఐ భావించింది. ఈ కారణంగానే ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన టోర్నీని ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. ఈరోజు(శనివారం).. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఫ్రాంచైజీలతో భేటీ అయింది. ఇందులో ఆరు నుంచి ఏడు అంశాలు చర్చకు వచ్చాయని అధికారులు చెప్పారు.
"ఈ సమావేశంలో ఆరు నుంచి ఏడు అంశాలు చర్చకు వచ్చాయి. అందులో ఐపీఎల్‌ను కుదించి నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది. విదేశాల్లో లీగ్ నిర్వహించాలన్న విషయం చర్చకు రాలేదు"