తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టు జట్టులోకి రావాలంటే మరింత శ్రమించాలి' - navdeep saini

భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకొనేందకు మరింతగా శ్రమిస్తానని అంటున్నాడు యువ క్రికెటర్ నవదీప్ సైనీ. ప్రస్తుతం ఈ ఫార్మాట్​లో టీమిండియా బౌలింగ్ విభాగం బలంగా ఉందని అన్నాడు.

సైనీ

By

Published : Sep 13, 2019, 1:59 PM IST

Updated : Sep 30, 2019, 11:08 AM IST

టీమిండియా తరఫున టీ20 అరంగేట్రంలోనే సత్తాచాటిన యువ బౌలర్ నవదీప్​ సైనీ.. టెస్టు జట్టులోకి వచ్చేందుకు మరింతగా శ్రమిస్తున్నానని అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో త్వరలోనే అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"సుదీర్ఘ ఫార్మాట్​లో మన బౌలింగ్ విభాగం బలంగా ఉంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్నప్పుడు నాకొక విషయం అర్థమైంది. టెస్టు జట్టులోకి రావాలంటే మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నా".

-నవదీప్ సైనీ, టీమిండియా యువ క్రికెటర్

దక్షిణాఫ్రికాతో అక్టోబర్​ 2 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్​ కోసం గురువారం జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. బౌలింగ్​ విభాగంలో ఉమేశ్​ యాదవ్​కు ఉద్వాసన పలికింది. బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా, అశ్విన్​, కుల్దీప్​ను తీసుకుంది.

వెస్టిండీస్​ పర్యటనలో టెస్టు జట్టుతో పాటే సైనీని కొనసాగించింది టీమిండియా. నెట్​ బౌలర్​గా అతడి సేవలను ఉపయోగించుకుంది.

ఇవీ చూడండి..

>>కోహ్లీ గురించి వ్యాఖ్య.. అనుష్క శర్మ కన్నీళ్లు

Last Updated : Sep 30, 2019, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details