ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఇటీవలే తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో 6-9 నెలలు పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. కానీ, వచ్చే వారమే తాను బరిలోకి దిగుతానని వార్నర్ అంటున్నాడు.
నవంబరులో భారత్‌తో రెండో వన్డే సందర్భంగా అతడు గాయపడ్డాడు. దాంతో మూడో వన్డే, టీ20 సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులు దూరమయ్యాడు. తన గాయం తగ్గడానికి 6-9 నెలలు పట్టొచ్చని వార్నర్ వ్యాఖ్యానించడం వల్ల అతడు ఐపీఎల్‌కు దూరమైనట్లేనని చాలా మంది భావించారు. అయితే తన మాటలు కలకలం రేపిన నేపథ్యంలో వార్నర్ వివరణ ఇచ్చాడు.