పాకిస్థాన్ తరఫున తిరిగి ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ దేశ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ స్పష్టం చేశాడు. ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్, ఆయన సిబ్బంది తమ పదవుల నుంచి వైదొలిగిన తర్వాతే తిరిగి జట్టులోకి వస్తానని తెలిపాడు. డబ్బుల కోసమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాననే వార్తల్ని ఖండించాడు.
"ప్రస్తుత యాజమాన్యం వైదొలిగితే పాకిస్థాన్ తరఫున తిరిగే ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీ కట్టుకథలు నమ్మించడానికి నాపై విష ప్రచారాన్ని మానుకోండి. ఆటగాళ్లకు కాస్త వ్యవధి, స్వేచ్ఛనివ్వండి. డ్రెస్సింగ్ రూమ్లో భయానక వాతావరణానికి చరమగీతం పాడండి. అప్పుడు ప్రస్తుతమున్న క్రికెటర్లే మంచి ఫలితాలు సాధిస్తారు"